ఆటోలో రెచ్చిపోయిన యువజంట..!

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆశతో కొందరు యువతీ యువకులు విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ వద్ద ఓ యువజంట ఆటోలో బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇది గతంలో బైక్‌లపై జరిగిన ఘటనలను గుర్తుచేస్తోంది.