శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది జీడి, కొబ్బరి తోటల పచ్చదనం. ఇంకా చెప్పాల౦టే అక్కడి ప్రజల కిడ్నీ సమస్యలు. కాని ఇటీవల కాలంలో ఉద్దాన౦ అ౦టే ఎలుగుబంట్లకు కెరాఫ్ అడ్రస్ గాను ముద్రపడుతో౦ది. గత కొన్ని నెలలుగా అదిగో ఎలుగుబంటి అంటే ఇదిగో ఎలుగుబంటి అ౦టున్నారు ఆ ప్రాంత వాసులు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా గ్రామాలలో ఎలుగుబంట్లు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల మనుషులపైనా, పశువులపైనా యదేచ్ఛగా దాడులకు పాల్పడుతూ పచ్చటి గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి.