స్వామీజీ చెప్పులకు పూజలు చేస్తుండగా షాక్!

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో సుమారు 2 వేల మందితో పాదుకలు (చెప్పులు)లకు పూజలు చేశారు. మహారాష్ట్రలోని ,నానిజ్ ధామ్ ఆశ్రమంకు చెందిన నరేంద్ర చారి మహరాజ్‌కు చెందిన పాదుకలు(చెప్పులు) పూజా కార్యక్రమం భక్తులు నిర్వహించారు. అయితే దీనికోసం వేసిన టెంట్లు, షామియానాలు ఒకేసారి కుప్పకూలిపోయాయి. ఓకేసారి పెద్ద ఎత్తున గాలి, దుమారం రావడంతో టెంట్లు కూలడంతో 100 మందికిపైగా భక్తులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారందరిని అంబులెన్సులలో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు.