పురూలియాలో ప్రధాని మోదీ భారీ రోడ్‌షో.. అడుగడుగున నీరాజనం!

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ప్రచారంలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్‌లో సుడిగాలి ప్రచారం చేశారు. బిష్ణుపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. బెంగాల్‌లో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. పురూలియాలో భారీ రోడ్‌షో నిర్వహించారు నరేంద్ర మోదీ. ఈ రోడ్‌షోకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనం అడుగడుగున ఘన స్వాగతం పలికారు. మోదీని చూసేందుకు జనం ఎగబడ్డారు.