Rolls-royce

కోనసీమలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది...ఊరికి దూరంగా ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలతో తీరిక లేకుండా గడిపే కోనసీమ వాసులు ఈ సంక్రాంతి పండగ పది రోజులు ఒక్కొక్కరిగా ఇంటి బాట పడుతుంటారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కత్తా వంటి ప్రధాన నగరాల నుంచి తమ సొంత కార్లలో ఊర్లకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త లగ్జరీ కార్లు కోనసీమ ప్రధాన పట్టణం అమలాపురం తో పాటు చుట్టుపక్కల పల్లెల్లో దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే రూ.12 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారు అమలాపురంలో చక్కర్లు కొట్టి సందడి చేసింది.