వీఐపీ నియోజకవర్గం అంటే ఎలా ఉంటుంది. అభివృద్ధి పరుగులు తీస్తుంది. గతంలో కేసీఆర్, కేటీఆర్‌లు ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలు కనీవినీ ఎరుగని డెవలప్‌మెంట్‌తో దౌడు తీశాయి. ఇప్పుడు అలాంటి మహర్దశే తెలంగాణలో మరో నియోజకవర్గానికి పట్టనుంది. కొడంగల్... కొత్త బంగారు లోకం కానుంది. తన సొంత నియోజకవర్గంలో ఇవాళ రూ. 4 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు.