కుండపోత వర్షాలతో తమిళనాడు అల్లాడిపోతోంది. రాకాసి వాన దెబ్బకు చెన్నైతోపాటు పలు జిల్లాలు విలవిల్లాడుతున్నాయ్. వరుణుడి విలయతాండవానికి గజగజ వణికిపోతున్నారు ప్రజలు. అయితే, కాపాడాల్సిన అధికార యంత్రాంగం.. ప్రజల ప్రాణాలు హరించే వ్యవహరిస్తున్నారు. జోరువానలో అత్యవసర చికిత్స కోసం వచ్చిన వృద్ధురాలి పట్ల కర్కశత్వం చూపించారు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది.