ఏపీలో జగ్గయ్యపేటలో డయేరియా టెన్షన్ కంటిన్యూ అవుతోంది. 8 గ్రామాల్లో బాధితులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. షేర్ మహమ్మద్‌పేట, చిలకల్లు, మక్కపేట, వత్సవాయి, అనుమంచిపల్లి, బుదవాడ, గండ్రాయి, దేచుపాలెం గ్రామాలతోపాటు జగ్గయ్యపేట పట్టణంలోని మోడల్ కాలనీ, సీతారాంపురం ప్రాంతాల్లో అతిసార ప్రబలింది. వందల మంది అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు.