సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.. ఆనందాల క్షణాల నడుమ ఆలింగనాలు..

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సచివాలయంలోని సీఎం చాంబర్‎కు నేరుగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికారు.