మీ ఒళ్లు బంగారం కానూ.. వాళ్లను చూస్తే మీరు ఇదే అంటారు. ఎందుకంటే అర తులం కొనాలంటేనే అపసోపాలు పడుతున్న జనం.. ఆ ఇద్దరి ఒంటిపై నిలువెత్తు బంగారం చూసి అసూయ పడుతున్నారు. పది వేళ్లకు ఉంగరాలు, రెండు చేతులకు భారీ కంకణాలు, బంగారు గడియారాలను చూసి నోరెళ్లబెడుతున్నారు. మెడలో వేలాడుతున్న భారీ స్వర్ణాభరణాలు చూసి అదృష్టమంటే మీదేనంటూ నిట్టూరుస్తున్నారు. బంగారం కొనలేకపోయినా.. నిలువెల్లా బంగారం దిగేసుకున్న వారితో ఫొటోలు దిగుతూ సంతోషపడుతున్నారు.