పాములను నివారించేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ స్ప్రే బీచ్ రోడ్ వెంబడి యోగా కార్యక్రమంలో పాల్గొనబోయే లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని, అధికారులు ముందస్తుగా పాములను పట్టే 50 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని మోహరించారు. ఈ బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటోంది. అంతేకాదు, పాములను ఆకర్షించకుండా ఉండేందుకు లెమన్ గ్రాస్ ఆయిల్ ను స్ప్రే చేస్తూ.. నివారణ చర్యలు చేపట్టారు.