ఎంజీఎం ఆస్పత్రిలో రౌడీ రాణీ వీరంగం..! వరంగల్‌లోని పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం ఆవరణలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ రౌడీ రాణీ, మాజీ యూనియన్ లీడర్ రెచ్చిపోయింది. మామూళ్ల కోసం అమానవీయంగా ప్రవర్తించింది. అంతా చూస్తుండగానే బరితెగించి, ఓ ఔట్ సోర్సింగ్ కార్మికురాలిని గొలుసులతో కొట్టి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించింది. ఎంజీఎం ఆసుపత్రిలో జరిగిన ఆ ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.