స్కూల్‌కి లేటవుతోందనే తొందరో.. లేదంటే పక్కన వెళ్తున్న వాహనాల వేగాన్ని అంచనా వేయడంలో పొరపాటో..! కారణం ఏదైతేనేం పసివాడి ప్రాణం టిప్పర్ టైర్ కింద నలిగిపోయింది. హైదరాబాద్ మల్లంపేటలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు కన్నీరుపెట్టిస్తున్నాయ్..! ఉదయాన్నే బాబును స్కూల్‌లో డ్రాప్ చేసేందుకు తల్లి తీసుకువెళ్తుండగా.. టూవీలర్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.