40 గంటలు చిమ్మ చీకట్లో కొండపై నరకం చూసిన మహిళ!

తిరువన్నామలై వెళ్ళిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు దీపోత్సవం జరిగే ప్రాంతానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే ఇటీవల భారీ వర్షాలు కొండ చరియలు విరిగిపడ్డ కారణంగా దీపోత్సవం జరిగే ప్రాంతానికి వెళ్లలేక పోయారు. దారి తప్పి ఒక రోజంతా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరిగిరాలేక రాత్రంతా అక్కడే ఉండిపోయారు. వెళ్లిన ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం ఎలాగోలా మరుసటి రోజు తిరిగి తిరువన్నామలై చేరుకోగలిగారు. మహిళా భక్తురాలు మార్గం తెలియక ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.