తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కంటైనర్ పాఠశాల.. ఎక్కడో తెలుసా..

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కంటైనర్ పాఠశాల.. ఎక్కడో తెలుసా.. మన్యంలో మగ్గుతూ అక్షర జ్ఞానానికి నోచుకోని గిరిపుత్రులకు నాలుగు అక్షరాలు నేర్పాలనే తాపత్రయం ఫలించింది. మంత్రి సీతక్క తొలి ప్రయత్నం శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంది.. ఆ మన్యం గుడాల్లో పాఠశాల శాశ్వత నిర్మాణానికి అటవీశాఖ ఆంక్షలు అడ్డురావడంతో అక్కడ కంటైనర్ పాఠశాల ఏర్పాటుచేసి ఆ గిరి పుత్రుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి సీతక్క..