భాగ్యనగరంలో సరికొత్త ప్రచార ట్రెండ్..

ఆమె దెబ్బకు పాతబస్తీలో పూనకాలు లోడింగ్‌ అన్నట్లు మారిపోయింది రాజకీయం. మొన్న మతపరమైన కట్టడంపై బాణం ఎక్కుపెట్టారని ఆరోపణలు వచ్చాయి. తర్వాత పతంగి అంతం చూస్తానంటూ పంతం పట్టారు. గాలి పటం ఎగరేస్తున్నట్టు యాక్షన్‌ చేసి, దాన్ని కట్‌ చేసినట్లు చూపించి.. బీజేపీ కేడర్‌లో కాక రేపారు. మాటల కంటే చేతలతోనే మంటలు రేపుతున్నారు. తన హావభావాలతో.. ఓల్డ్‌ సిటీలో కైట్‌ ఫైట్‌ని పీక్స్‌కి తీసుకువెళ్లారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం మామూలుగా లేదు.