కలకలం.. మహిళ సగం మృతదేహం లభ్యం.. అనకాపల్లి జిల్లా.. కసింకోట మండలం.. బయ్యవరం హైవే.. మంగళవారం ఉదయం ఒక్కసారిగా అలజడి. హైవే కల్వర్టులో ఓ బెడ్ షీట్ చుట్టి ఉంది. చుట్టూ కుక్కలు మూగుతున్నాయి. విషయాన్ని గుర్తించిన స్థానికులు దగ్గరకు వెళ్లి చూసేసరికి అవాక్కయ్యారు. బెడ్ షీట్లో ఉన్నది మృతదేహం గా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అది.. మహిళకు చెందిన సగం మృతదేహం.