సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం.. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దివ్యాంగురాలికి ఆహ్వానం పంపించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది.