నడి సముద్రంలో మూడు వేల కోట్ల డ్రగ్స్.. గుజరాత్ ATS, భారత తీర రక్షక దళం సంయుక్త ఆపరేషన్

అరేబియా సముద్రంలో గుజరాత్ ATS, భారత తీర రక్షక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సుమారు 526 కిలోల హెరాయిన్, మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకోగా.. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.