రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మరో వివాదం తెరపైకి వచ్చింది. శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చికెన్ బిర్యానీ పంపకం కలకలం రేపింది.‘హ్యాపీ బర్త్‌డే’, ‘మెర్రీ క్రిస్మస్’ అని ముద్రించిన ప్యాకెట్లు కనిపించడంతో ఇది అన్యమతప్రచారంలో భాగమనే విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నేతలతో పాటు భక్తులు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద సంస్థల పేర్లతో కూడిన కొన్ని ప్యాకెట్లను కూడా వారు గుర్తించారు.