బొప్పాయి పండులో వినాయకుడు ఆకృతి దర్శనం..! కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో వింత చోటు చేసుకుంది. బొప్పాయి పండులో కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యారు. వింత వినాయకుడు అందర్నీ అలరిస్తున్నాడు. బొప్పాయి పండులో వినాయకుడి రూపం దర్శనమివ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. తండోప తండలుగా తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.