భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న నదులు

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. మండి జిల్లాలోని బియాస్ నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మరోవైపు జిల్లా యంత్రాంగం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు ఢిల్లీ సహా యూపీ, ఉత్తరాఖండ్, హరియాణా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి.