ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన వివాహితను కాపాడి ఇద్దరు పోలీసులు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక మహిళ నిండు ప్రాణాన్ని కాపాడి, సమయానికి స్పందించి వృత్తిధర్మాన్నే కాదు.. మానవత్వాన్ని చాటుకున్న ఆ ఇద్దరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.