పెట్రోల్ బంక్‌కి వెళ్లి ఇంధనం పోసించుకున్న వాహనదారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బంక్ నుంచి పెట్రోల్‌కి బదులుగా నీళ్లు రావడంతో వాహనాలు కొంతదూరం వెళ్లగానే ఆగిపోయాయి. కాకినాడలోని భారత్ పెట్రోలియం బంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బంక్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసుకోమని చెప్పడంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ వద్దే మూడుగంటలపాటు ఆందోళన కొనసాగింది.