కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సి.గోకులాపురం గ్రామంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు తన ఆవేదనను వెలిబుచ్చారు. ‘‘ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థులను చేర్పించి, తల్లిదండ్రులు అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకోనవసరం లేదు. విద్యాబుద్ధులు నేర్పించడంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి" అని ఆమె స్పష్టం చేశారు.