రండి.. నాతో చేతులు కలపండి.. యువతకు ఎన్టీఆర్ పిలుపు..

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత తెలంగాణ పై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు తారక్.