వారు తొక్కితే రోగాలన్నీ మటుమాయం..! కాలి స్పర్శ తగిలితే సంతాన భాగ్యం..!

శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగే భూతప్పల ఉత్సవం ప్రత్యేక ఆచారాలతో ఆకట్టుకుంటోంది. దైవస్వరూపులుగా భావించే భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయనీ, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందనీ స్థానికుల విశ్వాసం. అందుకే తడి బట్టలతో భక్తులు భూతప్పలు నడిచే దారిలో పొర్లు దండాలు పెట్టి బోర్లా పడుకుంటారు.