పూర్తి స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూనే, నౌకాదళ సంపత్తి పెంపుతో ప్రపంచ దేశాలకు భారత్ సత్తా చాటుతోంది. సరిహద్దు తీరం వెంబడి నిరంతర నిఘా కొనసాగిస్తోంది. దాయాది దేశమైన పాకిస్థాన్, అలాగే చైనాతో ఏ క్షణమైనా ముప్పు ఉంటుందని అనుక్షణం అప్రమత్తమవుతూనే ఉంది. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... ఎప్పుడు పోరు జరిగినా చిత్తు చేయాలనే లక్ష్యాలతో భారత నౌకాదళ అమ్ముల పొదిలో అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖ తీరానికి ఓ శక్తివంతమైన యుద్ధ నౌక వచ్చింది. దాని గురించి తెలుసుకుంటే సెల్యూట్ కొట్టడమే కాదు, ఇది కదా మన దేశ సత్తా అంటూ తెగ గర్వపడతారు.