భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరో ఇద్దరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గాయపడిన మావోయిస్టులను మణుగూరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ గాలింపులో పోలీసులకు రెండు AK 47లు, మూడు SLRలు దొరికాయి. గ్రేహౌండ్స్ చీఫ్‌ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఆపేర,న్ జరిగింది.