గవర్నర్ తిరస్కరించడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం: ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తాజాగా.. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ తిప్పిపంపడాన్ని ఎమ్మెల్సీ కే కవిత తప్పుబట్టారు. బీఆర్ఎస్ బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. బీజేపీ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు.