పార్వతీ నదిలో అట్టపెట్టెల లెక్క కొట్టుకు పోయిన ట్రక్కులు... కులులోని సైంజ్‌ వ్యాలీలో క్లౌడ్‌బరస్ట్‌!

పార్వతీ నదిలో అట్టపెట్టెల లెక్క కొట్టుకు పోయిన ట్రక్కులు... కులులోని సైంజ్‌ వ్యాలీలో క్లౌడ్‌బరస్ట్‌! ఉత్తరాదిని భారీ వర్షాలు, వరదలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసరం అయితే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులులోని సైంజ్‌ వ్యాలీలో క్లౌడ్‌బరస్ట్‌ అయింది. ప్రమాదకర స్థాయిలో పార్వతి నది ప్రవహిస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఆట్‌-లహ్రి-సైంజ్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నదిలో కార్లు, ట్రక్కులు కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.