ఢిల్లీ ఎయిర్ పోర్టులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ ఔట్ నోటీసు ఉందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ఒక కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ లుక్ ఔట్ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. కాగా టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు, గన్నవరంలో దాడి కేసుతో పాటు మరో రెండు కేసుల్ని సీఐడీకి బదిలీ చేశామని తెలిపారు. ఆ కేసుకు సంబంధించి సజ్జలను డిటెయిన్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.