ఎన్నికల వేళ వినూత్న హామీ.. ఆడపిల్ల పుడితే 10వేల ఫిక్స్ డిపాజిట్!

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓ గ్రామపంచాయతీలో ఆడపిల్ల పుడితే రూ. పదివేలు ఫిక్స్ డిపాజిట్ చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఓటర్ల మన్ననలు దక్కించుకోవడానికి ఎలాగైనా భిన్నంగా కనిపించాలన్నదే నేతల మైండ్‌సెట్. ఎన్నికల వేళ వాగ్దానాలు కొత్తేమీ కావు. కానీ ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటినీ ఆర్థికంగా ఆదుకుంటామని ప్రచారం చేయడం విశేషం.