సాధారణంగా బుడి బుడి అడుగులు వేస్తూ.. వచ్చి రాని మాటలతో అల్లరి చేష్టలతో ముద్దొస్తుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం చిన్న వయసులోనే అద్భుత ప్రతిభ పాటవాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహనీయుల పేర్లు వారి చిత్రపటాలను గుర్తించుకోవడం, రాష్ట్రాల రాజధానులు, ప్రపంచ దేశాల రాజధానుల వంటి అంశాల్లో అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రతిష్టాత్మకమైన సంస్థల నుంచి ప్రశంసలు పొందింది.