ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్‌లైన్ టికెటింగ్ తీసుకొచ్చామంటున్నారు ఆర్టీసీ అధికారులు. త్వరలోనే మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయని అధికారులు తెలిపారు. చేతిలో చిల్లి గవ్వ లేకుండా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చని తెలిపింది. అలా అని అకౌంట్‌లో డబ్బులు ఉండాల్సిందే..! దీంతో చిల్లర లేదని ప్రయాణం మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి నుంచి ప్రయాణికులకు విముక్తి లభించనుంది.