55 ఏళ్ల లోపు మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తమ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి, విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా ఈ నెల 12న సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది.