పంట పొలాల్లో పరుగులు తీసిన చేపలు..! రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి జిల్లాలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏ రోడ్డు చూసినా వరద కనబడుతుంది. వరద ప్రవాహనికి చేపలు కొట్టుకు వస్తున్నాయి. భువనగిరి మండలం మసుకుంట వద్ద మత్స్య కార్మికులు సందడి చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వాగు నుంచి వస్తున్న వరదకు భారీ సైజులోని చేపలు కొట్టుకొస్తున్నాయి. వలల ద్వారా చేపలు పడుతున్నారు. చేపలను తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఆటోలను తెచ్చుకున్నారు. అటుగా వెళుతున్న వాహనదారులు కూడా ఆగి ఎగబడుతున్న జనాన్ని చూసి.. వాళ్లు కూడా చేపలు తీసుకొని వెళ్తున్నారు.