విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెను ప్రమాదం తృటిలో తప్పింది. చెత్త కుప్పలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు వచ్చిన ఓ ఫైరింజన్ ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్ దిగుతూ ఉండగా, ఫైరింజిన్ బ్రేక్ ఫెయిలై ప్రమాదానికి గురైంది. భక్తులపైకి దూసుకెళుతుండగా.. అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి డివైడర్ను ఢీకొట్టారు. వాహనం ఆగిపోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.