సాధారణంగా మనం ఏదైనా పరీక్ష రాయాలంటే ఏం చేస్తాం.. హాల్ టికెట్, పెన్ను లాంటి వస్తువులను వెంటబెట్టుకుని సమయానికి పరీక్ష కేంద్రానికి వెళ్లిపోతాం. కాస్త దూరంలో ఉన్న కేంద్రానికి అయితే ప్రైవేట్ వాహనమో లేదా బస్సు, ఆటోలాంటి వాటిని ఆశ్రయిస్తాం. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ సంఘటనలో విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళ్లడానికి ఏకంగా హెలికాప్టర్‌ను ఎంచుకున్నారు. ఏంటి.. పరీక్ష కోసం హెలికాఫ్టరా..? అని ప్రతి ఒక్కరూ మీలాగే ఆశ్చర్యపోయారు. ఎంచుకున్నారు అనే కన్నా అలా చేయడానికి ఆ విద్యార్థులకు అంతటి అవసరం ఏర్పడింది మరి.