అమ్మ బాబోయ్.. మళ్లీ పెద్దపులి వచ్చింది..

పులి సంచరిస్తుంది.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. దాని ఆనవాళ్లు కనబడుతున్నాయి. అయితే..స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఓ రైతు పొలం వద్ద ఉన్న ఆవును పెద్ద పులి చంపి తిన్న సంఘటన చోటు చేసుకుంది.