లిఫ్ట్ వాడకంపై రెండు కుటుంబాల మధ్య వివాదం.. ఏకంగా తీవ్రంగా దాడి చేసి, కొట్టి..

మహారాష్ట్ర-ముంబైలోని మాల్వణీ ప్రాంతంలో లిఫ్ట్ వినియోగం విషయంలో ప్రారంభమైన చిన్న గొడవ పెద్ద ఘర్షణగా మారింది. స్థానికంగా 25 ఏళ్లుగా నివసిస్తున్న అశ్విన్ రాజ్‌పుత్ కుటుంబం ఈ దాడికి గురైంది. నివాస సముదాయంలోని 7వ అంతస్తులో కొత్తగా అద్దెకు దిగిన ఓ కుటుంబం లిఫ్ట్ వాడే విషయంలో అశ్విన్ కుటుంబంతో వాగ్వాదానికి దిగింది. ఆపై అది ఉద్రిక్తంగా మారి ఆ యువకులు అశ్విన్ కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడం వరకు చేరింది. బాధిత కుటుంబానికి చెందిన తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ముందు అసలు నిజాలు బయటపెట్టింది.