సూక్ష్మ కళతో అబ్బురపరుస్తున్న చిన్నారి.. కర్నూలు జిల్లా ఆదోని మండలం బసరకోడు గ్రామంలో శ్రీనివాసులు, మహాలక్ష్మిల కూతురు జి.హిమవర్షిణి. తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. హిమవర్షిణి కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇంతకుముందు పాఠశాల విద్యార్థులు సుద్దముక్కపై శివలింగం, రావి ఆకుపై కార్గిల్ దివాస్ లాంటి చిత్రాలు చేయడంతో తాను ఎందుకు ఇలా చేయకూడదనుకుంది. అంతే రావి ఆకుపై చిత్రాలు వేయాలనుకుంది.