సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో మైహోమ్ సిమెంట్ కంపెనీ వినియోగదారుల సౌకర్యం కోసం కొనుగోలు చేసిన 250 సిమెంట్ బల్క్ ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైహోమ్ సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ ప్రెసిడెంట్ విజయవర్ధన్ రావు బల్క్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైహోం ఇండస్ట్రీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.