వారెవ్వా..! 152 రకాల వంటకాలతో అదిరిపోయేలా విందు..!

గోదావరి జిల్లాల ఆప్యాయతకు మురిసిపోయారు అతిధులు. ఆంధ్రా వంటకాలను రుచి చూసి, ఆహా ఏమి రుచి అంటూ కేరళావాసులు లొట్టలు వేశారు. అతిధి సత్కారం చేయాలంటే గోదావరి వాసుల ప్రత్యేకతే వేరు. కొత్తగా పెళ్ళి జరిగినా, కొత్త అల్లుడు ఇంటికి వచ్చినా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా విందు మాత్రం అదిరిపోవాల్సిందే..! రకరకాల స్వీట్లు, పిండి వంటలు, బిర్యానీలు, నాన్ వేజ్ పచ్చళ్ళు అన్ని రకాలు ఉండాల్సిందే. కొందరైతే వంద రకాలకు పైనే వడ్డిస్తారు.