విజయవాడలో పోలీసులకే కౌంటర్ ఇచ్చాడు

విజయవాడలో పోలీసులకే కౌంటర్ ఇచ్చాడు ఓ ద్విచక్ర వాహనదరుడు. నన్నే లైసెన్స్ అడుగుతారా అంటూ రెచ్చిపోయాడు.. అయితే, మీరు మీ ఐడి కార్డు చూపించండి అంటూ ట్రాఫిక్‌ పోలీసులనే ఎదురు ప్రశ్నించాడు. వాహనాల రెగ్యులర్ చెకింగ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ రామారావు ఓ ద్విచక్ర వాహనధారుడిని లైసెన్స్ చూపించాలని అడిగినప్పుడు..ఎదురు సమాధానంగా అతడు.. మీరు పోలిసులా కాదా నకిలీ పోలిసులు అయ్యి అంటారు మీ ఐడి కార్డు చూపించండి.. అంటూ వాగ్వాదానికి దిగాడు..