తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఐలాండ్ ఇది..! సహజ అందాలకు నిలయమైన ములుగు జిల్లాలో పర్యాటక శాఖ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభయ అరణ్యంలో ముస్తాబైన అందాల దీవి "బ్లాక్ బెర్రీ" ఐలాండ్ అట్టే మనసు దోచుకుంటుంది. ములుగు జిల్లాలో దట్టమైన అడవులు ఉన్న తాడ్వాయి - పస్రా మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నుండి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్లాలి. అక్కడ కనీసం సెల్ సిగ్నల్, విద్యుత్ సరఫరా కూడా ఉండదు. పూర్తిగా ఇసుక దిబ్బమీద మీద ఈ ఐలాండ్ రూపొందించారు.