రిసెప్షన్‌లో ఐస్‌యాపిల్స్ సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం

పెళ్లి వేడుకలో విందుని బిర్యానీ, పులిహోర, రకరకాల కూరలు, వివిధ రకాల టిఫిన్స్ తో పాటు దాహార్తిని తీర్చడానికి కూల్ డ్రింక్స్, షోడాలు, ఐస్ క్రీమ్ లు , జ్యుస్ లు వంటి రకరకాల ఆహార పదార్ధాలతో అతిధులకు అందిస్తున్నారు. అయితే ఓ పెళ్లి వేడుకలో బంధువులు, స్నేహితులు ఛిల్ అయ్యేందుకు విందులో వెరైటీ ఆహారాన్ని అందించారు. హైదరాబాద్ లోని మన్నెగూడలోని బీఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్‌లో జరిగిన ఒక పెళ్లి రిసెప్షన్ వేడుకలో వేసవి దాహార్తిని తీర్చేందుకు అందరు ఇష్టంగా తినే తాటి ముంజలను ఏర్పాటు చేశారు.