అనంతపురం నడిబొడ్డున గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న లింగ నిర్ధారణ పరీక్షలు వ్యవహారం కలకలం రేపుతుంది. రామచంద్ర నగర్ లోని ఓ ఇంట్లో చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పక్కా సమాచారంతో జిల్లా వైద్యాధికారులు, పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై దాడులు నిర్వహించారు. లోపల ఏం జరుగుతుందో తెలుసుకొని వైద్యాధికారులు, పోలీసులే షాక్ అయ్యారు. నాలుగు నెలల క్రితం రామచంద్ర నగర్ లో ఓ ఇంటిని అద్దెకి తీసుకున్న శ్రావణి, సునీల్... స్కానింగ్ మిషన్ పెట్టుకొని గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఓనర్ తో చీరల వ్యాపారం చేస్తామని చెప్పి... లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్క గర్భిణీ స్త్రీ నుంచి లింగ నిర్ధారణ పరీక్షలకు దాదాపు పదివేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు