వామ్మో గొడుగు పరిమాణంలో ఉన్న పుట్టగొడుగు.. షాకైన పరిశోధకులు..

అక్షరాల ఐదు కేజీల బరువు ఉన్న పుట్టగొడుగు.. ఓ రైతు పొలంలో పుట్టుకొచ్చింది. పుట్టగొడుగులు పెంచే ఫామ్‎లో కూడా అంత భారీ పుట్టగొడుగు పెరగదేమో. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లికి చెందిన వడ్డే హనుమంతరాయుడు అనే రైతు పొలంలో ఇటీవల ఓ పుట్టగొడుగు బయటకు వచ్చింది.