అభిమానులంటే అలా ఉండాలి. కార్యకర్తలంటే ఇలా ఉండాలి. మరి నాయకుడెలా ఉండాలి? అచ్చం ఆ ఎమ్మెల్యేలాగా ఉండాలి. ఏమిటంటా ఆయన గొప్పతనం? అంటారా.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆమ్యామ్యాలకు అలవాటుపడిన నేతలను చూస్తున్న మనకు అభిమానంతో ఇచ్చిన బహుమతిని కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తిత్వం ఆయనది. లవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జనసేన తరుఫున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నేతలు నిరాడంబరంగా జీవించారని, అతని లాగే అక్కడక్కడా కొంత మంది ఆదర్శంగా జీవించిన ప్రజా ప్రతినిధులు ఉన్నారని వినటమే కానీ, నేటితరం అలాంటి వారిని చూడలేదు. ఇదిగో వాళ్ల వారసుడిగా ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నిలిచారు.